రెండు రోజులుగా ఇంట్లోనే తల్లి, కుమారుడి మృతదేహాలు..

By అంజి  Published on  4 April 2020 2:20 AM GMT
రెండు రోజులుగా ఇంట్లోనే తల్లి, కుమారుడి మృతదేహాలు..

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోవూరు మండలం గంగవరం గ్రామంలో తల్లి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామంలోని ఓ ఇంట్లో గత రెండు రోజులుగా దుర్వాసన రావటాన్ని స్థానికులు గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి, కుమారుడు మృతదేహాలు ఉన్నాయి. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు వేమిరెడ్డి అనసూయమ్మ (70), కుమారుడు గోపాల్‌రెడ్డి (45)గా స్థానికులు చెప్పారు. వీరి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: న్యూయార్క్‌లో మృతదేహాలతో కిక్కిరిసిపోతున్న శ్మశానవాటికలు

Also Read: కామాంధుడి వెకిలి చేష్టలు..భయం గుప్పిట్లో మన్యం

Also Read: తెలంగాణలో 229కి చేరిన కరోనా కేసులు

Next Story
Share it