జొమాటో డెలివరీ బాయ్‌గా ఏడేళ్ల బాలుడు.. స్కూలుకు వెళ్లొచ్చాక..

Video of 7 year old delivering food for zomato goes viral harbhajan singh reacts watch. ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తూ బ్రతికే వాళ్లు ఉంటారు.

By Medi Samrat  Published on  5 Aug 2022 3:45 PM GMT
జొమాటో డెలివరీ బాయ్‌గా ఏడేళ్ల బాలుడు.. స్కూలుకు వెళ్లొచ్చాక..

ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తూ బ్రతికే వాళ్లు ఉంటారు. ఎంతో మంది డెలివరీ బాయ్ లుగా పని చేస్తూ వస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. ఢిల్లీకి చెందిన 7 ఏళ్ల బాలుడు జొమాటో డెలివరీ భాగస్వామిగా ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు వీడియో వైరల్ అవుతోంది. యాప్ నుండి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన రాహుల్ మిట్టల్ అనే ట్విట్టర్ వినియోగదారున్ని ఓ అబ్బాయి ఆశ్చర్యపరిచాడు. రాహుల్ ఆ బాలుడికి చాక్లెట్లు ఇచ్చి.. ఈ పని ఎందుకు చేస్తున్నావని బాలుడిని అడిగాడు. అందుకు సంబంధించి 30 సెకన్ల నిడివి గల వీడియోను కూడా పోస్ట్ చేశాడు.

రాహుల్ ట్విటర్‌లో "ఈ 7 సంవత్సరాల బాలుడు తన తండ్రి ఉద్యోగం చేస్తుండేవాడని.. అతని తండ్రి యాక్సిడెంట్‌కు గురయ్యాడు. బాలుడు ఉదయం పాఠశాలకు వెళ్తాడు. 6 తర్వాత అతను @zomato కోసం డెలివరీ బాయ్‌గా పనిచేస్తాడు." అని ఉంది. "This 7 year boy is doing his father job as his father met with an accident the boy go to school in the morning and after 6 he work as a delivery boy for @zomato we need to motivate the energy of this boy and help his father to get into feet #zomato." అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు.

బాలుడు ఉదయం పాఠశాల ముగిసిన తర్వాత డెలివరీ బాయ్ గా సాయంత్రం 6 నుండి 11 గంటల వరకు సైకిల్‌పై తిరుగుతున్నట్లు చెప్పాడు. అతనికి సహాయం చేయడానికి బాలుడి గురించి మరిన్ని వివరాలను పంపమని జొమాటో సంస్థ మిట్టల్‌ను కోరింది. "Hi Rahul, kindly share his father's details with us via a private message," అని Zomato రాసుకొచ్చింది. వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు బాలుడిని ప్రశంసించారు.





Next Story