తొలిసారిగా గోశాస్త్రంపై పరీక్ష నిర్వహణ.. ఎందుకో తెలుసా?

The cow test. ఇంతవరకు మనం ఎన్నో పరీక్షలను గురించి విన్నాం. చదువు పరంగా వివిధ రంగాలకు సంబంధించిన కానీ తొలిసారిగా గోశాస్త్రంపై పరీక్ష నిర్వహణ

By Medi Samrat  Published on  7 Jan 2021 10:39 AM GMT
cows

ఇంతవరకు మనం ఎన్నో పరీక్షలను గురించి విన్నాం. చదువు పరంగా వివిధ రంగాలకు సంబంధించిన అర్హత పరీక్షలను, ఉద్యోగ అర్హత పరీక్షల గురించి ఎన్నో చదివి, రాసి ఉంటాం. కానీ ప్రపంచంలో ఎక్కడ వినని, రాయని పరీక్షను మొట్టమొదటిసారిగా భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ పరీక్ష ఏమిటంటే? గో శాస్త్రంపై పరీక్ష... వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా మొట్టమొదటిసారిగా ఇండియాలో గో శాస్త్రంపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

గోశాస్త్రంపై ఇంగ్లీష్, హిందీ భాషలతో సహా 12 భారతీయ భాషలలో ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్ లైన్ ద్వారా పరీక్షను నిర్వహించబోతున్నారు. దేశీయ ఆవులు, వాటి ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసమే ఈ గోశాస్త్రంపై పరీక్షను నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ కామధేను అయోగ్ సమస్థ ఛైర్మెన్ వల్లభ్ భాయ్ కఠారియా తెలిపారు.రాష్ట్రీయ కామధేను అయోగ్ సమస్థ నిర్వహించే ఈ పరీక్షకు విద్యార్థులు, సాధారణ ప్రజలు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా పరీక్షలు రాయవచ్చని సంస్థ చైర్మన్ తెలిపారు.

మన హిందూ ఆచారం ప్రకారం ఆవులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి గోవుల గురించి ఇప్పుడు ఉన్న వారిలో ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల వాటిపై అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అయితే దేశంలో ఎప్పుడూ చూడని, వినని ఈ విధంగా గో శాస్త్రం పై పరీక్ష నిర్వహించడంతో ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తితో పాటు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం గోశాస్త్రం పై పరీక్ష గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


Next Story