ప్రపంచంలో నీళ్ల తర్వాత ఎక్కువగా సేవించే పానీయం ఏంటో తెలుసా?
Tea is the Second Most Consumed in the World after water. మన దేశంలో చాలా మంది పేద, ధనిక అనితేడా లేకుండా ఉదయం లేవగానే
By Medi Samrat
మన దేశంలో చాలా మంది పేద, ధనిక అనితేడా లేకుండా ఉదయం లేవగానే వారి దినచర్యను ఒక కప్పు టీ తో ప్రారంభిస్తారు. ఉదయం ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఎవరైనా స్నేహితులు,సన్నిహితులు కలిసిన మొదటగా వారికి చేసేటటువంటి మర్యాదలలో "టీ" ముందు వరుసలో ఉంటుంది.కేవలం మన దేశంలో దీనిని అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నారంటే "టీ" కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇట్టే అర్థం అవుతుంది.
అయితే డిసెంబర్ 15న అంతర్జాతీయ "టీ" దినోత్సవం కావడంతో తేయాకు రైతుల ఉత్పత్తి, కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 న అంతర్జాతీయ "టీ"దినోత్సవాన్ని పురస్కరించుకుంటారు. మొదటిగా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని 2005 డిసెంబర్ 15న జరుపుకున్నారు.ప్రస్తుతం బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా వంటి ఇతర దేశాలలో కూడా టీ దినోత్సవాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో నీళ్ల తర్వాత తాగే పానీయాలలో తర్వాత స్థానం టీ కి ఉంది. తాజాగా టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే తేయాకు లో దాదాపు 80 శాతం భారతదేశంలోనే వినియోగించబడుతుంది.
ఈ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి నుంచి కూడా టీ ఉపశమనం కలిగిస్తుంది. పని ఒత్తిడి పెరిగినప్పుడు ఒక కప్పు టీ తాగితే అలసట తగ్గిపోతుంది. అయితే ఈ తేయాకు నుంచి గ్రీన్ టీ, అల్లం టీ, వంటి వివిధ రకాల టీ లను తయారు చేసుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.