బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ను ఇటీవ‌ల ముంబై విమానాశ్ర‌యంలో అందరిలానే సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకోవాలనీ చెబుతూ, అక్కడి సీఐఎస్ఎఫ్ జ‌వాను సోమనాథ్ మహంతి అడ్డుకున్నారు. ఐడీ ప్రూఫ్ చూపించి వెళ్లాలని సల్మాన్ ఖాన్ ను సిఐఎస్ఎఫ్ అధికారి కోరారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం టైగర్ 3 చిత్రీకరణ కోసం రష్యా వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి వెళ్ళాడు. సల్మాన్ ఖాన్ ప్రవేశద్వారం వద్ద భద్రతా తనిఖీని పూర్తి చేయకుండా విమానాశ్రయం లోపలికి నడవటానికి ప్రయత్నించాడు. సల్మాన్ ఖాన్ తన పరివారంతో భద్రతా సిబ్బందిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోయాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్ ను ఆపేశాడు. తన ఐడెంటీని కన్ ఫర్మ్ చేసుకోవాలని సల్మాన్ కు సూచించాడు.

ఘ‌ట‌న అనంత‌రం స‌ల్మాన్‌ను అడ్డుకున్న జ‌వాను ఫోన్‌ను అధికారులు సీజ్ చేసిన‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనిపై సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూర్టీ ఫోర్స్ స్ప‌ష్ట‌త ఇచ్చింది. అవ‌న్నీ వ‌దంతులేన‌ని చెప్పింది. సీఐఎస్ఎఫ్ ఆఫీస‌ర్‌ను తాము మంద‌లించ‌లేద‌ని తెలిపింది. అంతేగాక‌, ఆయ‌న‌కు ఓ రివార్డు ప్ర‌క‌టించినట్లు సీఐఎస్ఎఫ్ ట్వీట్ చేసింది. ఉన్నతాధికారులు సోమనాథ్ మహంతిపై చర్యలు తీసుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. సిఐఎస్ఎఫ్ విభాగం.. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. అతను చేసిన పనికి గర్వంగా ఉందని.. సామాన్యులు, సెలెబ్రిటీలు ఒకటేనని అతడు రుజువు చేశాడని.. అతడిని సత్కరిస్తామని కూడా అధికారులు తెలిపారు. మంగళవారం (ఆగస్టు 24) ఒక ట్వీట్‌లో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఈ కథనాలన్నీ తప్పు అంటూ చెప్పుకొచ్చింది.


సామ్రాట్

Next Story