కొవిడ్ వ్యాధి తగ్గిన తరువాత పిల్లలు 'మల్టీసిస్టమ్ ఇన్ల్ఫ‌మేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్-MIS-C(మిస్-సీ)' ప్రభావానికి గురయ్యే అవకాశముంది.

కరోనా సెకండ్ వేవ్ లో పిల్లలు కూడా ఎక్కువగా వ్యాధి బారిన పడటం కారణం వల్ల ఈ మిస్-సీ జబ్బు కూడా ఈసారి ఎక్కువగా చూస్తున్నాం.

మనకి కేసులు ఎక్కువగా పెరుగుతున్నా.. మిస్-సీ అనే జబ్బు అందరికి రాదు. చాలా వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటారు. లక్షలో ఇద్దరికో, ముగ్గురికో వచ్చే అవకాశం ఉంది.

కోవిడ్ సోకిన 2-6 వారాల తర్వాత యాంటిబాడీస్ సాధారణo కంటే ఎక్కువ స్థాయిలో పెరిగి శరీరంపైనే దాడి చేయడాన్ని మిస్-సీ గా పరిగణిస్తునాం. ఇది శరీరంలో కిడ్నీలు, గుండె, కళ్ళు, మెదడు ఇతర అవయవాలకు సోకుతుంది.లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించి హాస్పిటల్ లో ఉండి వైద్యం చేసుకోవాలి. చాలా వరకు పిల్లలు ముందుగానే వైద్యం తీసుకుంటే త్వరగా, పూర్తిగా కూడా కోలుకుంటారు. కోవిడ్ నుండి కోలుకున్నాక కూడా పిల్లలని కొన్ని వారాల పాటు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది.

- Dr. మాహిష్మ .కె

Consultant Paediatrician

సామ్రాట్

Next Story