గైనకాలజిస్టులే టార్గెట్ గా మారారా..?

Gynaecologists forced to adopt defensive practices as govt. sets out to curb C-sections. గైనకాలజిస్ట్‌లు సమాజానికి సాఫ్ట్ టార్గెట్‌లా మారినట్లు డాక్టర్స్ చెబుతున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2022 1:32 PM GMT
గైనకాలజిస్టులే టార్గెట్ గా మారారా..?

గైనకాలజిస్ట్‌లు సమాజానికి సాఫ్ట్ టార్గెట్‌లా మారినట్లు డాక్టర్స్ చెబుతున్నారు. జూలై 1న డాక్టర్స్ డేను పాటిస్తూ, గైనకాలజిస్ట్‌ లు సి-సెక్షన్ల విషయంలో తమ నిర్ణయాల వెనుక ఉన్న సైన్స్ ను సమాజం గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు. సి-సెక్షన్ల విషయంలో డాక్టర్స్ ను నిందించడం కంటే అందుకు అయిన కారణాలను చూడాలని చెప్పారు. గైనకాలజిస్ట్‌లు సి-సెక్షన్‌ ఆపరేషన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారని.. తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటారని తెలిపారు.

ప్రసవ ప్రక్రియలో పురోగతి, యువ-మధ్య వయస్కులైన తల్లులలో సమస్యలు, గర్భిణీ ప్రసవ స్థితిలో ఇతరుల జోక్యం ఆందోళన కలిగించేవిగా మారాయి. గర్భిణీ స్త్రీల డెలివరీ విషయంలో కుటుంబాలు ఆలస్యమైన నిర్ణయాలను తీసుకోవడం కారణంగా శిశువు యొక్క ప్రాణానికి హాని కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో ప్రాక్టీస్ చేస్తున్న గైనకాలజిస్ట్ లే మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇది ఎంత వరకూ సమంజసమని గైనకాలజిస్టులు ప్రశ్నిస్తూ ఉన్నారు.

తెలంగాణలో సీ-సెక్షన్స్ రేటు 62 శాతం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 62% సి-సెక్షన్‌లు నమోదవుతున్నాయని, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ సంఖ్యను తగ్గించాలని ఆయన ఆదేశాలను కూడా ఇచ్చారు. డెలివరీ రూమ్‌లలో కలెక్టర్లు, డేటా మేనేజర్ల జోక్యం అవసరం లేదని వైద్యులు అంటున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సి-సెక్షన్‌లను ఎంచుకునే వారిపై నిఘా ఉంచాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను కోరాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగంలోని గైనకాలజిస్టులు సి-సెక్షన్‌ను ఎంచుకోవడానికి చివరి నిమిషం వరకు వేచి ఉండాల్సి రావడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

రోగికి రోగికి సైన్స్ భిన్నంగా ఉంటుందని క్లినికల్ డైరెక్టర్, కేర్ వాత్సల్య విభాగాధిపతి డాక్టర్ మంజుల అనగాని అభిప్రాయపడ్డారు. పరిపాలనాపరమైన జోక్యంతో ఒక వైద్యుడు స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేయడం కష్టతరం అవుతుందన్నారు. "గైనకాలజిస్ట్‌ల ద్వారా రక్షణాత్మక అభ్యాసం ప్రారంభించడాన్ని మేము చూస్తున్నాము. దీనిని ఆపకపోతే, ఇది దేశంలోని మహిళలు, తల్లి-శిశు మరణాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది" అని ఆమె చెప్పుకొచ్చారు.

డా.అనగాని మాట్లాడుతూ.. 'బిడ్డ పుట్టే విషయంలో చాలా సామాజిక ఒత్తిడి ఉంటుంది. మొదటి బిడ్డ సాధారణంగా ఉంటే ఇతర ప్రసవ ప్రక్రియలన్నీ సక్రమంగానే జరగాలని భర్త, కుటుంబ సభ్యులు నమ్ముతారు. మహిళలో వచ్చే మార్పులపై వారికి అవగాహన లేదు. డెలివరీ సాధారణంగా చేయగలిగితే, వైద్యుడు దానిని ఎందుకు ఎంచుకోరు? ఇది అర్థం చేసుకోవడానికి వారు ఇష్టపడరు." అని చెప్పుకొచ్చారు. హై రిస్క్ డెలివరీల విషయంలో కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయని ఆమె చెప్పారు. సి-సెక్షన్ ను ఆలస్యం చేయడం వలన మహిళ జీవితాంతం సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు.

ప్రసవం అనేది వైద్యులకు సంబంధించినది మాత్రమే కాదు.. మొత్తం కుటుంబానికి సంబంధించినది. ఆసుపత్రుల వద్ద గందరగోళాన్ని సృష్టించే రాజకీయ అనుబంధాలతో బయటి వ్యక్తుల పాత్ర భారతదేశంలో ఎక్కువగా ఉంది. వీటన్నింటి కారణంగా తల్లి ఎక్కువగా బాధపడుతోంది. గైనకాలజిస్ట్‌లతో సహా ఆమె కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉంది.

వైద్యుడు-రోగి సంబంధానికి పునాది నమ్మకం. డాక్టర్‌కి, పేషెంట్‌కి మధ్య నమ్మకం తగ్గుతోంది. వైద్యులు తమ వంతు కృషి చేయాలని భావిస్తున్నారు, అయితే ఒక రోగి, వారి కుటుంబాలు కొందరు దుర్మార్గులతో కలిసి డాక్టర్‌ను అవమానించడానికి, వేధించడానికి, కొట్టడానికి ముందుకు వస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో జరిగిన సంఘటనలు కూడా ఆందోళన కలిగించేవే..!

సీనియర్ గైనకాలజిస్ట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పాయల్ భార్గవ మాట్లాడుతూ "వివిధ జనాభా సమూహాలలో సాధారణ ప్రసవాల సామర్థ్యం తగ్గుతోంది. ఈ అంశం సమాజానికి అర్థం అవ్వడం లేదు. శిశుజననం విషయంలో విద్యావంతులు, చదువురానివారు ఒకే స్థాయిలో ఉన్నారు. ఇంటర్నెట్ నుండి అడపాదడపా సమాచారాన్ని తీసుకుంటారు కానీ అసలు వైద్య కారణాలు అర్థం కాలేదు. వైద్యులకు హాని కలిగించడం, వారితో చెడుగా ప్రవర్తించడం ఆనవాయితీగా మారింది. అది ఆపకపోతే రాబోయే రోజుల్లో మహిళల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది."



























Next Story