ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. గతంలో వ్యాక్సిన్ వేసుకునే సమయాల్లో ముందుకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. భారత్ లో కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలనుకున్నా కూడా మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతూ ఉన్నారు.
కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు 45 రోజుల పాటు మద్యం తీసుకోకూడదని సూచించారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్న వారు కొన్ని వారాల పాటు మద్యానికి దూరంగా ఉండాలని చెప్పడంతో మందుబాబులు షాక్ అవుతూ ఉన్నారు.
నేషనల్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సుదర్శన్ మాట్లాడుతూ ముప్పై రోజుల వ్యవధిలో టీకా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని.. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాతనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం సేవిస్తే అది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు ఆటంకం కలిగిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం వ్యాక్సిన్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని ఆధారాలు ఉన్నాయని చెప్పి మందుబాబులకు ఎక్కడ లేని షాక్ ను ఇచ్చారు. టీకా తీసుకోవాలనుకునే వారు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం మంచిదని చెబుతూ ఉన్నారు.