గ్రౌండ్ రిపోర్ట్: మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్సెస్ టీఆర్‌ఎస్‌

Ground report It is Komatireddy vs TRS, not BJP vs TRS; Huzurabad redux in Munugode.మునుగోడు ఉప ఎన్నికలో హుజూరాబాద్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2022 1:27 PM IST
గ్రౌండ్ రిపోర్ట్: మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్సెస్ టీఆర్‌ఎస్‌

మునుగోడు ఉప ఎన్నికలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సీన్ పునరావృతం కావడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మధ్య పోరు తప్ప బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ మధ్య పోరు మాత్రం కానే కాదని స్పష్టంగా తెలుస్తోంది. నవంబర్ 3వ తేదీన జరిగే పోరు కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్సెస్ టీఆర్‌ఎస్‌ అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ, కొత్తగా ప్రవేశించిన BSP 3 లేదా 4 స్థానాలతో సరిపెట్టుకోవచ్చని అంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక భిన్నమైనదేమీ కాదని.. `మందు', `ముక్క', `మనీ'తో నిండిపోయిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధికారం కోసం ఊహించని స్థాయిలో పోటీ ఉంది. మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో ఐదు నల్గొండ జిల్లాలో.. రెండు యాదాద్రిలో ఉన్నాయి. నియోజకవర్గం 2,90,229 (జనాభా), ప్రధానంగా వెనుకబడిన కులాల ప్రజలు- పద్మశాలి, గౌడ్‌లు, యాదవ్, ముదిరాజ్, చాకలి. రైతులు, నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. చౌటుప్పల్, నారాయణపూర్, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లె, గట్టుప్పల్‌లో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 50-60 శాతం మంది ఓటర్లు వరుసగా 18-19 ఏళ్లు, 20-30 ఏళ్లలోపు వయస్సు గల యువకులే కావడం గమనార్హం. అక్టోబరు 31 సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. ఇక న్యూస్‌మీటర్ బృందం నల్గొండలోని కొన్ని మండలాల్లో పర్యటించి ఓటర్ల 'మూడ్'ని విశ్లేషించింది.

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే పలుకుబడి:

మునుగోడు-నాంపల్లె మధ్య ఉన్న చండూరు మండలం గురువారం ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తింది. ప్రధాన కూడలికి ఒక చివరలో బీజేపీ కాన్వాయ్.. క్రాస్ రోడ్డులో మహిళల నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ర్యాలీ ఉంది. అదే వీధుల్లో బీఎస్పీ క్యాడర్ ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు.

"చండూరు మండలంలో 15 గ్రామాలు ఉన్నాయి. సుమారు 30,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటు బ్యాంకులో ప్రధానంగా గౌడ్‌లు, యాదవులు ఉన్నారు. మొత్తం 7-8% మంది సైలెంట్ ఓటర్లు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి వైపు మొగ్గు చూపించడానికి రాజగోపాల్ రెడ్డి చేసిన సహాయం కూడా ఒక కారణమని అంటున్నారు.. ఉదాహరణకు.. "ఒక పేద ST బాలుడు పైలట్ శిక్షణకు అర్హత సాధించాడు, కానీ ఆర్థిక స్థోమత లేదు, రాజగోపాల్ అతని చదువుకు నిధులు సమకూర్చాడు, ఆ అబ్బాయి ఇప్పుడు పైలట్ అయ్యాడు. ఓ ఇంటి పెద్ద ప్రమాదంలో మరణించినప్పుడు, అతని కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లించాడు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి ఒక్కొక్కరికి రూ.50వేలు ఇస్తూ వెళ్లారు. ఎంతో మంది విద్యార్థుల స్కూల్ ఫీజులు చెల్లించాడు. కోవిడ్ సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కుటుంబాలకు రేషన్ సాయం చేశాడు'' అని కంది మల్లారెడ్డి అనే ఓటరు చెప్పుకొచ్చాడు. తుమ్మలపల్లె గ్రామంలో 850 మంది ఓటర్లు ఉండగా, రాజగోపాల్‌కు ఉన్న ఇమేజ్‌ కారణంగా బీజేపీ వాటా 60-70 నుంచి 300కు పెరిగింది. మారేడ్‌గుడ్డ మండలం చండూరులో బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది.


నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో, తాత్కాలిక గుడారాలు, 2 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలికంగా నిర్మించిన ఇల్లు ఉన్నాయి. ఫార్చ్యూనర్స్, రేంజ్ రోవర్స్ నుండి మెర్సిడెజ్ బెంజ్ వరకు, ఎన్నికల ప్రచారం కోసం మాజీ పార్లమెంటేరియన్, MLC, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిని తీసుకువెళ్లడానికి అనేక హై-ఎండ్ కార్లు, ఓపెన్-టాప్ వాహనాలు పార్క్ చేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన రాజగోపాల్‌కు మునుగోడులో ఇల్లు లేకపోవడమే ప్రధాన లోపమని, గెలిస్తే వారంలో కనీసం 3 రోజులైనా నియోజకవర్గంలో ఉండాలనే ఆలోచనలో ఉన్నారని రాజగోపాల్‌ అన్న కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి అన్నారు.

టీఆర్ఎస్ బలంపై నమ్మకంతో కోసుకుంటల ప్రభాకర్ రెడ్డి:

రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిత్వ ప్రాబల్యం ఆధారంగా ఎన్నికల్లో పోరాడుతుండగా.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాజకీయ మైలేజీ, సంక్షేమ పథకాలపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొసుకుంటల ప్రభాకర్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు.


టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు ఎర్రగి యాదయ్య మాట్లాడుతూ ''రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలి?.. కేసీఆర్‌ అధికార పార్టీపై పోరాడి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరా? సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నాను, ప్రభుత్వం రైతు, దళితుల పక్షపాతిగా ఉంది. ఇంతకుముందు నేను కాంగ్రెస్‌కి ఓటేశాను, చండూరు మునిసిపల్ ఎన్నికల్లో కూడా వారికి మద్దతిచ్చాం కానీ ఈ ప్రజాప్రతినిధులు ఎవరూ అందుబాటులో లేరు. రాజగోపాల్ బీజేపీలోనే ఉంటారనే గ్యారంటీ ఏమిటి" అని ప్రశ్నించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు, దళిత బంధు, సీనియర్‌ సిటిజన్‌ ​​పింఛన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌లపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ప్రభాకర్‌రెడ్డికి ప్లస్ గా మారనుంది. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కాకుండా తన వ్యక్తిగత హోదాలో ప్రజలకు సహాయం చేశారని, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. అనేక అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నందున టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని ఆశిస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తొలిసారిగా గెలుపొందారు.

ఆంధ్ర కోడలు:

1967 నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. 1967 నుంచి 1985 మధ్యకాలంలో దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారు. నియోజకవర్గం గోవర్ధన్ రెడ్డికి తిరిగి రాకముందే సీపీఐకి చెందిన ఉజ్జయిని నారాయణరావు వరుసగా 3 సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు.

ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గోవర్ధన్ రెడ్డి కుమార్తె. "స్రవంతికి ఆమె తండ్రి కారణంగా సానుభూతి ఓట్లు ఉన్నాయి, కానీ ఆమె జీవిత భాగస్వామి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెంది వ్యక్తి కావడంతో ఆమెను 'ఆంధ్రా కోడలి'గా చూస్తున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు స్రవంతికి మద్దతు ఇవ్వడం వల్ల మాత్రమే ఆమె గెలవదని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది, బీజేపీలోకి వెళ్లినా కాంగ్రెస్‌ మద్దతుదారులు ఆయనకే సపోర్ట్ గా ఉన్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఎన్నికల పరిశీలకుడు తెలిపారు. "స్రవంతి నియోజక వర్గంలో ఎన్నడూ కనిపించలేదు, ప్రజలకు అందుబాటులో లేరు. ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్‌కు ఓటు వేసినా అది టీఆర్‌ఎస్‌కు లాభిస్తుంది'' అని అధికారి తెలిపారు. సీపీఐ, సీపీఎంల మద్దతుతో టీఆర్‌ఎస్‌ తన ఓటు బ్యాంకును నిలుపుకోవడంలో విజయం సాధించి, కాంగ్రెస్‌కు అధిక మెజారిటీ ఓట్లు వస్తే, ఎన్నికల ఫలితాలు బీజేపీని మూడో స్థానానికి నెట్టివేస్తాయని కొందరు భావిస్తూ ఉన్నారు.


మునుగోడులో కొత్త రాజకీయ ప్రవేశించింది. మాజీ IPS అధికారి, డాక్టర్ B.R అంబేద్కర్ ఫాలోవర్ అయిన ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ. 2000 మంది కార్యకర్తలతో కూడిన క్యాడర్‌తో BSP ఆందోజు శంకర చారిని రంగంలోకి దించింది. అన్నింటికంటే మించి పోటీ చేస్తున్న ఒకే ఒక్క బీసీ అభ్యర్థి. మందు, ముక్క, డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోరాడండి అనేది BSP ఎన్నికల ప్రచారం. RS ప్రవీణ్ కుమార్ వారి స్టార్ క్యాంపెయినర్‌గా ఉండటంతో, ఇప్పటివరకు 208 గ్రామాలను కవర్ చేసారు.


న్యూస్‌మీటర్ జి.నాగేందర్‌తో మాట్లాడుతూ.. బీఎస్పీ మిర్యాలగూడ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌ సార్‌.. బీసీ అభ్యర్థులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే మా ఎన్నికల శంఖారావం.. వెనుకబడిన కులాల వారిని సీఎం కేసీఆర్‌ అవహేళన చేయడం చాలాసార్లు చూశాం. వారిని పేర్లు పెట్టి పిలిచారు. బీసీ ఓటర్లు ఆ విషయాన్ని మర్చిపోరు. ఓటర్లకు డబ్బులు ఇవ్వకుండా బీజేపీ,టీఆర్ఎస్ పోట్లాడుకుంటాయా? మునుగోడు ఓటర్లు మెజారిటీ బీసీలే ఉండగా బీజేపీ,టీఆర్ఎస్,కాంగ్రెస్ అగ్రవర్ణాల అభ్యర్థిని ఎందుకు నిలబెట్టాయి. అర్హులైన చాలా మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. కేసీఆర్ ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ? మునుగోడులో ప్రభుత్వాసుపత్రి లేదు, నల్గొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఎంతో మంది చనిపోయారు.. టీఆర్‌ఎస్‌కు సీపీఐ, సీపీఎం పార్టీల మద్దతు ఎందుకు? సీపీఐ, సీపీఎం నాయకులు తప్ప కిందిస్థాయి కేడర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని కోరుకోవడం లేదన్నారు.

మిషన్ భగీరథ: నల్గొండలో ఫ్లోరోసిస్ కేసులు తగ్గుముఖం పట్టాయి

గత కొన్ని దశాబ్దాలుగా, నల్గొండ ప్రాణాంతక ఫ్లోరోసిస్‌తో పోరాడుతోంది. నల్గొండలోని దాదాపు 59 మండలాలు ఫ్లోరోసిస్‌ బారిన పడ్డాయని అధికారిక సమాచారం. మునుగోడు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు.. చాలా కాలంగా ఈ వ్యాధి బారిన పడ్డాయి. అయితే, గత ఐదేళ్లుగా, ఫ్లోరోసిస్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల ఉంది. నల్గొండ పౌరులు ఈ ఘనత మిషన్ భగీరథ కే దక్కుతుందని అంటారు. నల్గొండలోని అన్ని ఇళ్లలో మిషన్ భగీరథ నుండి కుళాయిలు ఉన్నాయని నివేదించారు. ఈ కుళాయి రోజుకు ఒక గంట పాటు నడుస్తుంది. ప్రతి ఇంటికి నీటి పరిమితి 100 లీటర్లు ఇస్తూ ఉన్నారు.


"మిషన్ భగీరథ నుండి ఫ్లోరైడ్ రహిత నీరు నాతో సహా అందరికీ సహాయపడింది. ఈ నీరు త్రాగడానికి, వంట అవసరాలకు సరిపోతుంది. అయినప్పటికీ, మేము ఇప్పటికీ అన్ని సాగు, వ్యవసాయ అవసరాలకు భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నాము. నల్గొండను ఫ్లోరోసిస్ రహిత జిల్లాగా మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం" అని స్వామి అన్నారు. టీఆర్‌ఎస్ విజయం సాధించి శివన్నగూడెం రిజర్వాయర్ (డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అని కూడా పిలుస్తారు) ప్రాజెక్టును ప్రారంభిస్తుందని ఫ్లోరోసిస్ బాధితులు అన్నారు. ఈ ప్రాజెక్టు భూగర్భ జలాల వినియోగానికి ముగింపు పలకనుంది. ఇది ఇతర వనరుల నుండి నీటిని పంపుతుంది. రిజర్వాయర్ ఒక్కటే ఫ్లోరోసిస్‌ను పూర్తిగా నిర్మూలిస్తుందని భావిస్తున్నామని స్వామి అన్నారు.


Next Story