కొత్త రకం కరోనా వైరస్‌కు పేరు పెట్టిన శాస్త్రవేత్తలు.. దాని ల‌క్ష‌ణాలు కూడా చెప్పారు

Covid-19 mutation N440k. కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు ఎన్440కే రకంగా

By Medi Samrat  Published on  28 Dec 2020 10:40 AM GMT
కొత్త రకం కరోనా వైరస్‌కు పేరు పెట్టిన శాస్త్రవేత్తలు.. దాని ల‌క్ష‌ణాలు కూడా చెప్పారు

కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు ఎన్440కే రకంగా పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. కొత్తరకానికి కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉందని.. యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణాలతో జన్యుపరివర్తనాలు (మ్యుటేషన్లు) జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. జులై-ఆగస్టు నెలల్లో ఆసియాలో ఎన్440కే రకం కరోనా వైరస్ ఆవిర్భవించిందని అంటున్నారు. దేశవ్యాప్తంగా 5 శాతం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌కు యాంటీ బాడీల నుంచి తప్పించుకునే లక్షణాలు ఉన్నట్లు తెలియడం కూడా అందరినీ టెన్షన్ పెట్టే అంశమే..!

ఎన్440కే రకంతో పాటు, యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే మరికొన్ని రకాల మ్యుటేషన్లు.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు. దేశవ్యాప్తంగా మొత్తం 6,370 జీనోమ్ విశ్లేషణలు జరపగా, 2 శాతంలో ఎన్440కే రకం మ్యుటేషన్ గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34 శాతం శాంపిళ్లలో ఎన్440కే రకం గుర్తించారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎన్440కే ఉన్నట్టు నిర్ధారించారు. కరోనా పాజిటివ్స్‌లో మూడింట ఒక వంతులో ఈ వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్440కే రకం ఉన్నట్లు తేలింది. కొత్త రకం వైరస్ ను ఇప్పుడు తీసుకుని వస్తున్న వ్యాక్సిన్లు నిలువరించగలవా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

కరోనా కొత్త వైరస్‌తో తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. ఎక్కువ మందికి సోకి కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఇది మరణాల సంఖ్య అధికం కావడానికి పరోక్షంగా కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.


Next Story