ఆనంద్ మహీంద్రా చేసిన బెస్ట్ ట్వీట్స్ ఏవో తెలుసా.!

Anandh Mahindra Best Tweets. ప్రతిరోజు నిత్యం లాభ,నష్టాల లెక్కలు చూసుకుంటూ, ఆదాయం పెంచుకునే ప్రణాళికలు వేస్తూ

By Medi Samrat  Published on  1 Jan 2021 3:37 AM GMT
Anandh Mahindra

ప్రతిరోజు నిత్యం లాభ,నష్టాల లెక్కలు చూసుకుంటూ, ఆదాయం పెంచుకునే ప్రణాళికలు వేస్తూ, వ్యాపారాన్ని ఎలా విస్తరించాలనే ఆలోచనలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉంటారు. కానీ వీరందరికీ ఎంతో భిన్నంగా తన జీవితంలో తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలని చెప్పే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర ఒకరని చెప్పవచ్చు. ఈయన అందరిలా కాకుండా సోషల్ మీడియాలో వచ్చే జోకులకు తనదైన శైలిలో స్పందించి అందరినీ నవ్విస్తూ ఉంటారు. అంతేకాకుండా తను చేసే ట్వీట్స్ ద్వారా కొన్ని సార్లు కంటతడి కూడా పెట్టి ఇస్తుంటారు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఈ ఏడాది తను చేసిన ట్వీట్స్ లో ద బెస్ట్ ట్వీట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఒక వీడియోలో ఒక పెద్దాయన ప్రతిరోజు బరువులను ఎత్తుతూ తంటాలు పడుతుంటాడు. కానీ ఆ పెద్దాయన ఎందుకలా కష్టపడుతున్నాడు క్రిస్మస్ రోజు రాత్రి తెలుస్తుంది.తన మనవరాలి చేత క్రిస్మస్ ట్రీ పై స్టార్ ను ఉంచేందుకు ఆ విధంగా కష్టపడుతున్నాడు అనేది ఆ వీడియో సారాంశం. ఈ వీడియో చూసిన ఆనంద్ మహేంద్ర తనదైన శైలిలో స్పందిస్తూ ఈ వీడియో చూసి తనుకి ఏడుపొచ్చిందని ట్వీట్ చేశాడు. ఆనంద్ మహేంద్ర చేసిన ఈ ట్వీట్ చూసి ఎంతో మంది తాము సైతం కంటతడి పెట్టినట్లు రీట్వీట్ చేశారు. అప్పట్లో మహేంద్ర ట్వీట్ బాగా వైరల్ అయింది.

అంతేకాకుండా ఒంటరి చీమ 29 సంవత్సరాలు బ్రతుకుతుంది అంటూ ఎవరో ఫేస్బుక్ ద్వారా పెట్టిన పోస్టుకు.. మరొక నెటిజెన్"మరి పెళ్లైన చీమ పరిస్థితి ఏంటి భయ్యా"అని కామెంట్ చేశాడు. అయితే ఆ వ్యక్తి చేసిన కామెంట్ చూసి ఎంతో నవ్వానని ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశాడు. అంతేకాకుండా కరోనా సమయంలో ఎంతో మందికి తన ట్వీట్ ద్వారా జీవిత సత్యాలను కూడా తెలియజేశారు. ఆనందం ఎక్కడ ఉంది? అనే ప్రశ్నకు సమాధానంగా.. అది ఎవరో ఇచ్చేది కాదు,సొంతంగా పొందాలని ఒక చిన్న కార్టూన్ రూపంలో ఎంతో సులభంగా సమాధానం తెలియజేశాడు. ఈ విధంగా మరెన్నో జీవిత సత్యాలను తెలుపుతూ ఆనంద్ మహేంద్ర ట్వీట్స్ చేశారు.
Next Story