సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2019 10:26 AM GMT
సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

యాంకర్‌గా, యాక్ట‌ర్‌గా, సింగ‌ర్‌గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా... ఇలా త‌ను ప్ర‌వేశించిన శాఖ‌లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు ర‌ఘు కుంచె. తాజాగా 'రాగల 24 గంటల్లో' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సందర్భంగా ర‌ఘు కుంచె మాట్లాడుతూ .."శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాకి వ‌ర్క్ చేసాను. మ‌ళ్లీ ఇప్పుడు 'రాగ‌ల 24 గంట‌ల్లో' సినిమాకి వ‌ర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రమిది.

ఈ సినిమాకి సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించాను. గతంలో నేను సంగీతాన్ని అందించిన రెండు, మూడు సినిమాలకి వేరే సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ చేశాడు. నేను చేయవలసిన వర్క్ ను ఆయన నా నుంచి లాక్కున్నాడు. అలా... అవకాశాలు పోవడం నాకు చాలా బాధ కలిగించింది. మొదటి నుంచి వున్నవారు చేసే పనికి .. మధ్యలో వచ్చి చేరేవారు చేసే పనికి చాలా తేడా వుంటుంది. 'రాగల 24 గంటల్లో' రీ రికార్డింగ్ పరంగా కూడా నాకు మంచి పేరు తెస్తుంది అని చెప్పారు కానీ... త‌న అవ‌కాశాలు లాక్కున్న‌ది ఎవ‌రు అనేది మాత్రం చెప్ప‌లేదు.

Next Story