ముషారఫ్‌కు ఉరి శిక్ష..!
By Newsmeter.Network
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ (76)కు ఉరిశిక్ష అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. దేశ ద్రోహం కేసులో పర్వేజ్ ముషారఫ్‌ను ఫెషావర్ హైకోర్టు దోషిగా తేల్చింది. 2016 నుంచి దుబాయ్‌లో ముషారఫ్ తలదాచుకున్నాడు. కాగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి శిక్ష పడడం ఇదే ప్రథమం. ముషారఫ్‌పై దేశ ద్రోహం కేసుతో పాటు అవినీతి కేసులు ఉన్నాయి. ముషారఫ్‌పై ఉన్న దేశద్రోహం కేసుపై సుధీర్ఘ కాలంగా విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు గల ధర్మాసనం మంగళవారం ఉరిశిక్ష విధిస్తు నిర్ణయం తీసుకుంది. 2007 సంవత్సరంలో అక్కడి రాజ్యాంగాన్ని రద్దు చేయడం, దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన కారణంగా దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2014లో దేశ ద్రోహం కింద ముషారఫ్‌పై కేసు నమోదైంది. కాగా 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్న ముషారప్.. ఆరోగ్య, భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్‌కు వచ్చేందుకు నిరాకరిస్తునట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ ముషారఫ్ ఇటీవలే లాహోర్ హైకోర్టు ఆశ్రయించారు.