'మునిసిపోల్' సమరం రానే వచ్చింది.! ఎప్పుడంటే.?
By Medi SamratPublished on : 2 Nov 2019 12:09 PM IST

మళ్లీ ఎన్నికల పండగ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మునిసిపల్ సమరం రానే వచ్చింది. ఈనెల 4వ తేదీ సోమవారం నాడు మునిసిపల్ ఎన్నికల నగారా మోగనుంది. మునిసిపల్ ఎన్నికలపై కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. సోమవారం మీడియా ద్వారా షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మునిసిపల్ శాఖ వార్డుల రిజర్వేషన్లను డ్రా తీయనుంది.
ఇదిలావుంటే.. రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో మునిసిపల్ ఎన్నికలు జరుగనున్నట్టు సమాచారం. కోర్టు సమస్యలు లేని మునిసిపాలిటీలకు మొదటిదశలో ఎన్నికలు జరుగనున్నాయి. కోర్టు విచారణలో ఉన్న మునిసిపాలిటీలకు రెండో దశలో జరుగనున్నట్టు సమాచారం. ఇకపోతే.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొదటిదశ ఎన్నికలు జరిగే మునిసిపాలిటీల చైర్మన్, వార్డుల రిజర్వేషన్ల కసరత్తును కూడా పూర్తి చేసింది.
Next Story