ముంబై వూహాన్ ను దాటేసింది..!
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 12:36 PM ISTకరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. చెనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక వైరస్ పుట్టిన వుహాన్ నగరంలో కంటే మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధిక నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి ముంబైని అతలాకుతలం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,259 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 120 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి రవకు ముంబాయి నగరంలో 51వేల పాజటివ్ కేసులు నమోదు కాగా.. 1760 మంది మృత్యువాత పడ్డారు. ఇక మహమ్మారి పుట్టిన వుహాన్ నగరంలో 50,333 కేసులు నమోదు కాగా.. 3,869 మంది మృత్యువాత పడ్డారు. కేసుల విషయంలో వుహాన్ ను ముంబై దాటింది. వుహాన్‌తో పోలీస్తే ముంబైలో మరణాలు తక్కువ సంఖ్యలో నమోదు అవుతుండడం సానుకూల అంశం. ఇప్పటికే మహారాష్ట్ర కరోనా కేసుల విషయంలో చెనాను అధిగమించిన సంగతి తెలిసిందే.
వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా ప్రభుత్వం ఇప్పటికే విజయం కాగా.. భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 9వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,985 కేసులు నమోదు కాగా.. 279 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,76,583 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,745 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,33,632 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,35,206 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు
ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడులలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ క్రమంలోనే జూలై నాటికి దేశ రాజధాని ఢిల్లీ 5లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చన్న అధికారుల అంచనా ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.