9848032919.. నెంబర్ ఇంకా గుర్తుందా.? ఎవరిదనుకుంటున్నారు.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 8:47 AM IST
9848032919.. నెంబర్ ఇంకా గుర్తుందా.? ఎవరిదనుకుంటున్నారు.?

ఒక్కడు.. కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద తీసిన ఒక్కసీన్ తో పాటు..మహేష్ - భూమికల మధ్య మౌనంగా సాగిన ప్రేమకథ, మరోవైపు అదే భూమిక కోసం ప్రకాష్ రాజ్ వెతుకులాట.. అన్నింటినీ మించి గుణశేఖరుడి టేకింగ్ సినిమాకు హిట్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మహేష్ సైలెంట్ కామిడి కూడా అందరినీ బాగా నవ్వించింది. ముఖ్యంగా భూమికకు పాస్ పోర్ట్ విషయంలో పాస్ పోర్ట్ ఆఫీసర్ ను కలుస్తారు మహేష్ బాబు అండ్ ఫ్రెండ్స్. అక్కడ పాస్ పోర్ట్ ఇవ్వడానికి టైం పడుతుంది.. వారం తర్వాత రండి అని చెప్పి పంపేస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూ.. కొత్తగా ఫోన్ కొన్నాను. మొదటగా నీ వాయిస్ వినాలని నీకే ఫోన్ చేశా. నంబర్ చెప్తా రాసుకో అంటూ కొత్త ఫోన్ నంబర్ చెప్తాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం (పాస్ పోర్ట్ ఆఫీసర్).

Ms

ధర్మవరం చెప్పే ఆ నంబర్ విన్న మహేష్ గ్యాంగ్.. ఆయనను ఒక ఆట ఆడుకుంటారు. సినిమా మొత్తంలో ఈ కామెడీ సీన్ బాగా పండింది. కానీ.. ఆ సీన్ లో పెట్టిన మొబైల్ నంబర్ అదేనండి.. 9848032919 నంబర్ ఎవరిదో తెలుసా ? ఆ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజుది. సినిమా షూటింగ్ లో భాగంగా ఆ సీన్ చిత్రీకరించేటపుడు ఎవరి నంబర్ పెట్టాలా ? అని ఆలోచిస్తుండగా.. ఎవరిదో ఎందుకు నిర్మాత గారి నంబర్ ఇస్తే సరిపోతుందిగా అని అక్కడున్నవారిలో ఎవరో అన్నారట. అంతే ఇక ఎంఎస్ రాజు మొబైల్ నంబర్ ఆ సినిమా రిలీజ్ తర్వాత బాగా ఫేమస్ అయింది. రోజూ లక్షలాది మంది ఫోన్లు చేస్తుండటంతో.. ఆ బాధ భరించలేని ఎంఎస్ రాజు..దెబ్బకి నంబర్ మార్చేశారట. ఇదండీ 9848032919 నంబర్ వెనకున్న అసలు కథ.

Next Story