ధోనీ కూతురిపై అస‌భ్య‌క‌ర ట్రోలింగ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2020 1:34 PM IST
ధోనీ కూతురిపై అస‌భ్య‌క‌ర ట్రోలింగ్‌

గ‌త ప్ర‌పంచ‌క‌ప్ నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్న మ‌హేంద్ర‌సింగ్‌ ధోనీ.. యూఏఈ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2020లో ఆడుతున్న విష‌యం తెలిసిందే. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఫేల‌వ ఫామ్‌తో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 13వ సీజన్‌లో 6 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. కేవలం రెండు మ్యాచ్ ల‌లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

అయితే.. సీఎస్‌కే చివరగా కోల్‌కత నైట్ రైడర్స్ తో తలపడి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ధోనీ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అత‌ని కుటుంబానికి సంబంధించి సోష‌ల్ మీడియ‌లో అసభ్యకర పోస్టులు చేశారు.

అందులో మరి కొంతమంది అతిదారుణంగా ధోనీ 5 సంవత్సరాల కూతురు అయిన జీవా ధోనికి సంబంధించి అత్యాచార బెదిరింపులకు పాల్పడుతునారు. ప్రస్తుతం హత్రాస్ ఘటన నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా ఆగ్ర‌హ‌జ్వాల‌లు వెలువ‌డుతున్న త‌రుణంలో.. ఇటువంటి పోస్టులు చేయ‌డం తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ విష‌య‌మై ధోనీ అభిమానులు అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.



Next Story