నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ.?

By అంజి  Published on  26 Feb 2020 11:02 AM GMT
నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ.?

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. 'కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయాడు. పేద వాళ్లకు తిండి దొరకకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని చంద్రబాబు అంటున్నారని అన్నారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్లో రూ.5 భోజనం కోసం ఎదురుచూసే వాళ్లుండటమేమిటి? అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు. కుప్పంలో పేదరికమే లేదని గంటాపథంగా చెప్పాల్సిన వాడివి. ఇంత దీనపు పలుకులు ఏమిటి?' చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో ప్రశ్నించారు.ఇటీవల చంద్రబాబు టీడీపీ శ్రేణులను మరింత ఉత్తేజపరిచే దిశగా ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటూ తన చైతన్య యాత్రలో ప్రజలకు చెబుతూ.. టీడీపీ పార్టీని బూత్‌ స్థాయిలో పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మాటల యుద్ధం మొదలు పెట్టారు. 'వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సిఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు' అంటూ ట్వీట్‌ చేశారు. వైసీపీ నేతలు ఒకవైపు జాలి చూపిస్తూనే.. మరోవైపు సంచలన కామెంట్స్‌ చేస్తున్నారు.'సిఎం జగన్ నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. నువ్వు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్ లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడివి. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా నీది. ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది.' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు.Next Story
Share it