ఎంపీ నందిగం సురేశ్‌కు చేదు అనుభవం..
By అంజి
విజయవాడ: నందిగామాలో బాపట్ల ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్‌కు అమరావతి నిరసన సెగ తగిలింది. ఆయన కారును అడ్డుకున్న కార్యకర్తలు.. జై అమరావతి అనాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఎంపీ సురేశ్‌పై పలువురు కార్యకర్తలు దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. కొందరు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు నందిగం సురేశ్‌ను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
మూడు రాజధానులు.. ఒక రాజధానే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. పరిపాలన వికేంద్రీకరణ కాదు అని ప్లకార్డులతో నిరసన తెలిపారు. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ సురేశ్ తెలిపారు. దీంతో ఆయన వాహనాన్ని చుట్టుముట్టిన కార్యకర్తలు దానికి ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఓ వైద్యుడిని నందిగం సురేశ్ కలిసే క్రమంలో ఈ ఘటన జరిగింది.
అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాలు, మహాధర్నాలు 47వ రోజుకు చేరుకున్నారు. మూడు రాజధానులు వద్దంటూ రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అమరావతి ప్రజల ఉద్యమానికి ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన మద్దుత ప్రకటించాయి. కాగా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారని నాగార్జున యూనివర్సిటీలో నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. అమరావతి కోసం గళం విప్పిన అశీర్వాదం, నవీన్, రాజు, ఏడు కొండలును యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ సస్పెండ్ చేశారు.