కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. చెన్నైలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. 64 ఏళ్ల దుర్గాప్రసాద్‌కు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గ‌త 15 రోజులుగా చికిత్స పొందుతున్న క్ర‌మంలో ఆయ‌నకు తీవ్ర గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు. దుర్గా ప్రసాద్ గత ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరి తిరుపతి ఎంపీగా గెలుపొందారు. గతంలో చంద్రబాబు మంత్రి వర్గంలో ఆయన విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. దుర్గాప్రసాద్ మరణం పట్ల వైసీపీ అధినేత, సీఎం జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌కు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంది. 28 ఏళ్ల‌కే ఆయ‌న మొద‌టిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 1985, 1994, 1999, 2009లో (నాలుగు సార్లు) ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *