త్వరలో వెండితెరపైకి రానున్న మౌనిక
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Nov 2019 5:37 PM ISTబుల్లితెర వీక్షకులకు మౌనిక గుంటుక ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. జీ తెలుగులో ప్రసారమైన 'పున్నాగ' సీరియల్ తో టీవీ ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం జీ తెలుగులో మరో రెండు సీరియల్స్ చేస్తున్నారు. 'గుండమ్మ కథ'లో ప్రియా, 'సూర్యకాంతం'లో ప్రమీల పాత్రలు పోషిస్తున్నారు.
ఇన్ని రోజులు బుల్లితెరపై అలరించిన మౌనిక, త్వరలో వెండితెరపైకి వస్తున్నారు. మౌనిక మాట్లాడుతూ "సీరియల్స్ నటిస్తుండడం వల్ల, సినిమా అవకాశాలు చాలా వస్తున్నాయి. మంచి సినిమాలో మంచి పాత్రతో త్వరలో వెండితెర ప్రేక్షకుల ముందుకు వస్తాను" అని అన్నారు.
Next Story