మౌలాలి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం..
By అంజిPublished on : 14 March 2020 1:50 PM IST

హైదరాబాద్: మౌలాలి రైల్వేస్టేషన్‌లో వద్ద శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రెండు కోచ్‌లలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది.. అధికారులు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. కాగా మంటలు చెలరేగడానికి గల కారణాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story