బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు.. నేడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లేముందు తన రాజకీయ గురువు ఎన్‌టీఆర్ సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత‌ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాజకీయ చైతన్యం తీసుకు వచ్చిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. నా తల్లిదండ్రుల తర్వాత.. రాజకీయ ఓనమాలు నేర్పించి అవకాశాలు కల్పించిన తండ్రి లాంటి ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశంతోనే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల‌ నాయకత్వంలో పేదలు, ఎస్సీ, ఎస్టీలు, దేశం అభివృద్ధి చెందుతుందని భావించి బీజేపీలోలో చేరానని మోత్కుపల్లి అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.