మదర్స్ డే సందర్భంగా 'కూ' లో సరికొత్త క్యాంపెయిన్
Koo Celebrates Mother’s Day Launches New Campaign. తల్లి ప్రేమను మరే వాటితోనూ పోల్చలేము.. ఎందుకంటే అమ్మ ప్రేమ ఆకాశమంత..
By Medi Samrat Published on 8 May 2022 4:15 PM ISTతల్లి ప్రేమను మరే వాటితోనూ పోల్చలేము.. ఎందుకంటే అమ్మ ప్రేమ ఆకాశమంత..! ఆమె ప్రేమ గురించి ప్రపంచానికి చాటడానికి 'మదర్స్ డే' రోజున 'కూ(Koo)' ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టింది. కూ యూజర్లు మదర్స్ డే రోజు పెట్టే పోస్టులకు #MummyYaar అనే ట్యాగ్ ను జోడించండి. ఈ డిజిటల్ యుగంలో తల్లుల గొప్పదనాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా.. వారికి నచ్చిన భాషలో తమ మనసులోని భావాలను కూ ద్వారా బయటపెట్టవచ్చు. ఇలాంటి ఆలోచనలు గల వినియోగదారులతో కనెక్ట్ కావడం కోసం కూ కొత్తగా క్యాంపెయిన్ ను తీసుకుని వచ్చింది. పిల్లల కోసం జీవితాలను ధారపోస్తున్న తల్లుల అంకితభావం గురించి తెలియజేయడానికి మదర్స్ డే రోజున సరికొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. పిల్లలు జీవితాలను మెరుగుపరుస్తూ, ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న తల్లుల గురించి తెలియజేసే వారి కోసం #MummyYaar ను తీసుకొని రావడం జరిగింది.
మదర్స్ డే రోజున క్యాంపెయిన్ లో పాల్గొనే వారు "mummy, yaar" పదాలను ఉపయోగించాల్సి ఉంది. ఇప్పటికే యూజర్లు #MummyYaar తో పోస్టులను అప్లోడ్ చేస్తూ ఉన్నారు. తమ తల్లులతో తీసుకున్న ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ విన్నర్స్ కు మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తామని కూ సంస్థ చెబుతోంది. ఈ క్యాంపెయిన్ May 9, 2022 వరకూ కొనసాగుతుంది. "#MummyYaar ద్వారా మాతృత్వ స్ఫూర్తికి వందనం చేయాలని మేము భావించాము. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, సామాజిక మాధ్యమాలను చురుకుగా ఆదరిస్తూ, కొత్తవాటిని సమర్థిస్తూ, ప్రజల ప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించుకునేలా తమ చుట్టూ ఉన్నవారిని ప్రేరేపించే తల్లులందరికీ మేము హృదయపూర్వక 'ధన్యవాదాలు' తెలియజేస్తున్నాము." అని కూ ప్రతినిధి తెలిపారు.