తల్లీకొడుకుల ప్రాణం తీసిన టిక్‌టాక్
By తోట వంశీ కుమార్ Published on 19 May 2020 5:17 PM IST
టిక్‌టాక్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టిక్‌టాక్ చేయవద్దంటూ భర్త మందలించడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి చనిపోవడంతో ఆమె కుమారుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
విజయవాడ నగరంలోని వైయస్సార్ కాలనీకి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. ఇటీవల భార్య టిక్‌టాక్ యాప్‌ను ఎక్కువగా ఉపచయోగిస్తుంది. భార్య టిక్‌టాక్ యాప్‌కు బానిసగా మారిపోతుందని గ్రహించిన భర్త.. టిక్‌టాక్ వీడియోలు చేయవద్దని భార్యను మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన భార్య నిన్న ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మరణవార్త విన్న కుమారుడు జీర్ణించుకోలేకపోయాడు. నేడు సైనేడ్ తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. రోజు వ్యవధిలో తల్లీ కొడుకులు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.