250 మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు

By సుభాష్  Published on  16 Jun 2020 3:47 PM IST
250 మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు

ముందే కోతి.. దాని చేష్టలు ఎలాగుంటాయో అందరికి తెలిసిందే. ఈ మధ్యన కోతులు మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి. ఒకప్పుడు కోతులు అడవుల్లో మాత్రమే నివసించేవి. కానీ ఇప్పుడు జనవాసాల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వందలాదిగా కోతులు తిరుగుతున్నాయి. అవి చేసేనష్టాలు అన్ని ఇన్నీ కావు. గ్రామాల్లో అయితే ఇళ్లపై కూన పెంకులు పగులగొట్టడం, మనుషులపై దాడి చేయడం, కరవడం లాంటివి చేస్తుంటాయి. ఇక తాజాగా ఓ కోతి 250 మందికి కరవడంతో దానికి జీవిత ఖైదుగా ఓ బోనులో ఉంచి బంధించారు. ఏంటి మనుషులకు కదా జీవిత ఖైదు విధించేది ..కోతికి ఎలా అనుకుంటున్నారా.. ఇది నిజమే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కార్పూర్‌లో చోటు చేసుకుంది.

ఆరేళ్ల కిందట మిర్జాపూర్‌ జిల్లాలో పుట్టిన ఆ కోతిని ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఆ వ్యక్తి కోతికి ప్రతి రోజూ మద్యం అలవాటు చేశాడు. ఇలా మద్యానికి బానిసైపోయిన ఆ కోతికి యజమాని ఎప్పుడు మద్యం తెచ్చుకున్నా.. పక్కనే వచ్చి కూర్చునేది. మద్యంలో సోడా కలిపి ఎప్పుడు పోస్తాడా.. అనే విధంగా ఎదురు చూసేది. ఇక కోతికి సోడా కలిపి మద్యం ఇవ్వడమే కాకుండా మంచింగ్‌ కోసం చిరుతిళ్లు సైతం ఇచ్చేవాడు. ఇంకేముందు తినుకుంటూ ఎంచక్క మద్యం తాగేది. ఒక రోజు యజమాని అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అప్పటి నుంచి కోతి అలనా పాలనా చూసేవారే కరువయ్యారు. ముందు కోతికి మద్యానికి బానిసైపోయింది. యజమానికి మృతి చెందిన తర్వాత కోతికి మద్యం కరువైంది.

అప్పటి నుంచి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. చిరాకు, ఆవేశం, కోపంతో రగిలిపోయేది. ఎవరు కనిపిస్తే వాళ్ల మీద దూకి దాడి చేయడం, వాళ్లను కరవడం మొదలు పెట్టింది. ఇలా ఈ ఒక్కతి తో మిర్జాపూర్‌ మొత్తం కలలం రేగింది. ఆ కోతి కనిపిస్తే చాలు బయట ఉన్నవాళ్లంతా భయంతో ఇళ్లకు పరుగులు పెట్టేది. పట్టుకుందామన్న ఎవరికి దొరికేది కాదు. ఇక చేసేదేమి లేక మిర్జాపూర్‌ వాసులు జూ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చిన పట్టుకుందామని చూసినా చుక్కలు చూపించిందట. చివరికి ఎలాగోలా దానిని పట్టుకుని బంధించారు. అప్పటికే ఆ కోతి 250 మందికి కరిచిందట. కరిచిన వాళ్లలో ఒకరు మృతి చెందారు కూడా.

అధికారులు కోతిని పట్టుకుని ప్రత్యేక బోను ఏర్పాటు చేసి అందులో బంధించారు. కొన్నాళ్ల తర్వాత కోతి ప్రవర్తలో మార్పు వస్తుందని బయటకు వదిలి పెట్టారు. మిగతా కోతులతో ఉంచి చూశారు. అయినా కోతిలో ఏ మార్పు రాలేదు. మళ్లీ మనుషులపై దాడి చేయడం, కరవడం మొదలు పెట్టింది. ఇక కోతిలో మార్పు రాదనుకున్న జూ అధికారులు చివరికి మళ్లీ పట్టుకుని సింగిల్‌ బోనులో బంధించారు. మూడేళ్లుగా అలాగే ఉంటుంది. ప్రతిరోజు దానికి అధికారులు ఆహారం అందిస్తున్నారు. ఇక జీవిత కాలం బోనులోనే బంధించి ఉంచుతామని జూ డైరెక్టర్‌ మహమద్‌ నాజిర్‌ తెలిపారు. ఎన్ని రోజులైన అది మారదనే ఉద్దేశంలో జీవితాంతం బోనులో ఉంచి ఆహారం అందిస్తామని ఆయన తెలిపారు. చూశారా.. ఒక వ్యక్తి చేసిన మద్యం అలవాటు వల్ల ఎంతో మందికి కరిచి చివరకు జైలు పాలైంది.

Next Story