ఆ డ‌బ్బులు మోదీ పంపాడ‌నుకొని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చుచేశాడు.. ఏం జ‌రిగిందంటే.!

By అంజి  Published on  23 Nov 2019 6:17 AM GMT
ఆ డ‌బ్బులు మోదీ పంపాడ‌నుకొని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చుచేశాడు.. ఏం జ‌రిగిందంటే.!

విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించి దానిని సామాన్యుల అకౌంట్‌లో వేస్తానన్న మోదీ తన మాటను నిలబెట్టుకున్నారనుకున్నాడు మధ్యప్రదేశ్‌కు చెందిన హుకుం సింగ్. కొంతకాలంగా తన అకౌంట్‌లో నెలనెలా వచ్చిపడుతున్న డబ్బులు హాయిగా తీసుకుని వాడుకున్నాడు. ఎలా పడుతున్నాయో కూడా ఆలోచింకుండా వేసిన ఓటుకు మోదీ తనకు న్యాయం చేస్తున్నాడని భావించాడు... ఇంతకీ ఏమి జరిగిందంటే..

ఒకే పేరున్న ఇద్దరికి ఒకే ఖాతా నెంబర్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వాకం ఇది. ఇద్దరిలో ఒకరు డబ్బులు డిపాజిట్ చేస్తుండగా మరొకరు వాటిని విత్ డ్రా చేసి ఎంజాయ్ చేశారు. వింతైన ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. హుకుం సింగ్ అనే పేరున ఇద్దరికీ ఒకే అకౌంట్ నెంబర్‌ను ఎస్‌బీఐ కేటాయించింది. రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్, రోనీ గ్రామానికి చెందిన హుకుం సింగ్ ఇద్దరు ఒకేసారి ఖాతాలు తెరిచారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఆ ఇద్దరికీ పొరపాటున ఒకే ఖాతా నెంబర్ కేటాయించారు. దీంతో ఒకరు దాచుకున్న డబ్బులు ఇంకొకరు వాడుకున్నారు. తన ఖాతాలో నగదు జమ అవడంతో అవి ఎక్కడినుండి వచ్చాయో తెలియక మోదీ ఇచ్చాడని భావిస్తూ హుకుం సింగ్ వాడుకున్నాడు. అలా ఆరు నెలల కాలంలో దాదాపు ఎనభై తొమ్మిది వేలు డ్రా చేసుకున్నాడు. మరో హుకుం సింగ్ అకౌంట్లో చూడగా రూ.35 వేలు మాత్రమే మిగిలినట్లు గుర్తించాడు. ఎస్‌బీఐ బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా జరిగిన పొరపాటున కనుగొన్నారు. దీనికి పరిష్కారం ఏమిటో తెలియక తలపట్టుకు కూర్చున్నారు.

Next Story