ఒక వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ డిప్యూటీ  తహసీల్దారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి వద్ద రూ .15 వేల లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దారును అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా, సూర్యకుమారి అనే మహిళకు చెందిన రెండెకరాల భూమి ఉంది. అందులో ఆమెకు బియ్యం మిల్లు ఉంది. మిగిలిన భూమికి పట్టదార్ పాస్‌బుక్ జారీ చేయమని ఆమె డిప్యూటీ తహశీల్దార్ రాజేష్‌ను కోరగా, ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి డిప్యూటీ తహసీల్దార్‌ రాజేష్ రూ .20వేలు డిమాండ్‌ చేసి, అందులో  రూ .5 వేలు ముందుగా ఇవ్వాలని మహిళను డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. పాస్‌బుక్ పొందడానికి మిగిలిన డబ్బును అధికారికి ఇవ్వాలని సూర్యకుమారి తన కొడుకు సతీష్ కుమార్‌కు తెలిపింది. మిగితా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  ఈనేపథ్యంలో సతీష్‌ సదరు అధికారికి డబ్బులు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజేష్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.