రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
By తోట వంశీ కుమార్ Published on 13 April 2020 3:12 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తిని నిరోధించడానికి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ ను ప్రధాని నరేంద్ర మోదీ విధించిన సంగతి తెలిసిందే. కాగా ఆ గడువు రేపటితో ముగియనుంది. మంగళవారం ఉదయం 10గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం(పీఎంవో) వెల్లడించింది. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా లేదా అనే విషయం పై రేపు స్పష్టత రానుంది. కాగా నేడే(సోమవారం) ప్రధాని జాతినుద్దేశించి ప్రస్తంగిస్తారని వార్తలు వచ్చినప్పటికి ఆయన మంగళవారం ప్రసంగించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది.
ఇటీవల అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెజార్టీ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరాయి. కాగా ఇప్పటికే ఒడిషా, పంజాబ్, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాయి.