దేశంలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో ముగిసింది. ఈ సందర్బంగా మోదీ ప్రజారోగ్యానికే పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. మొదటిసారిగా మోదీ మాస్క్‌ ధరించి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ పొడిగించాలని మోదీకి చెప్పారు. దీంతో మోదీ కూడా లాక్‌డౌన్‌ పొడిగించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్, కరోనా కేసుల తీరుపై ముఖ్యమంత్రులతో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నాకు తెలపండి అంటూ సీఎంలకు సూచించారు మోదీ. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, కరోనా వైరస్‌ను కలిసి కట్టుగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రులకు సూచించారు.

కాగా, ఈ రోజు సాయంత్రం హైలెవల్ కమిటీతో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయనున్నారు. ఎన్ని  రోజులు పొడిగించాలి.. ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి.. అనే అంశాలను వెల్లడించనున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.