వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్‌ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో కేటీఆర్‌ ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగి ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో రామ్‌గోపాల్‌ వర్మ కూడా ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. మద్యం దొరక్క కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరి కొంత మంది విచిత్రంగా ప్రవర్తిస్తూ మెంటల్‌ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

ఈ విషయాన్ని రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తావించారు. ‘ఇంట్లో బోర్‌ కొట్టే వారికి, తమ జట్టును పీక్కునే వారికి, చిన్న పిల్లలుగా ఏడ్చే వారికి, మందులేక మానసికంగా కుంగిపోయి మెంటల్‌ ఆస్పత్రుల్లో చేరుతున్నారని, మద్యం లేక ఏం చేయలే అర్థం కాక కొందరు భర్తలు భార్యలను కొట్టేవారి బాధలను పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలాగా పెద్ద మనసు చేసుకోవాలని కేటీఆర్‌, కేసీఆర్‌లను విజ్ఞప్తి చేశారు వర్మ.

ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ‘రాము గారూ మీరు మాట్లాడేది హెయిర్‌ కట్‌ గురించి అనుకుంటా’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో నెటిజన్లు కేటీఆర్‌ రాక్స్‌.. వర్మ షాక్స్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.