28 ఏళ్ల తర్వాత రెండో సారి అయోధ్యకు మోదీ

By సుభాష్  Published on  1 Aug 2020 6:27 PM IST
28 ఏళ్ల తర్వాత రెండో సారి అయోధ్యకు మోదీ

ఈనెల 5న అయోధ్యలో రామమందిర భూమి పూజ కార్యక్రమం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం వేదికపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేవలం ఐదుగురికే చోటు ఉంటుందని రామాలయ తీర్థ ట్రస్ట్‌ ప్రకటించింది. సరిగ్గా 28 ఏళ్ల తర్వాత రెండు సారి ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యకు వస్తున్నారు.

1992లో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను రద్దు చేయాలంటూ కన్యాకుమారి నుంచి మోదీ తిరంగా యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల మీదుగా యాత్ర కొనసాగించిన మోదీ.. జనవరి 18న ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు.

ఫైజాబాద్‌ సమీపంలోని మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆనాటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్‌ జోషి హాజరయ్యారు. సమావేశం మరుసటి రోజున జోషి అయోధ్యలోని రామ్‌లాలాను సందర్శించారు. దీంతో మోదీ కూడా రామ్‌లాల దర్శించుకుని శ్రీరాముడి ఆలయం నిర్మించే సమయంలో మరోసారి అయోధ్యకు వస్తానని ఆ రోజు చెప్పారు.

ఇలా 28 ఏళ్ల కిందట చెప్పినట్లుగానే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు రెండుసారి అయోధ్యకు మోదీ వస్తున్నారు.. అని మోదీతో కలిసివున్న జోషి ఫోటో తీసిన సీరియర్‌ జర్నలిస్టు మహేంద్ర త్రిపాఠి అన్నారు.

కాగా, అయోధ్య రామమందిరం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే వారు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్‌ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిరం కట్టాలన్న డిమాండ్‌తో 1990లో అద్వానీ చేప‌ట్టిన‌ రథయాత్ర బీజేపీని మరింత ఎత్తున నిలబెట్టాయి.

Next Story