'మోదీ' పెట్టుకున్న 'కళ్లజోడు' ఖరీదెంతో తెలుసా..?
By సుభాష్ Published on 27 Dec 2019 4:27 PM ISTదేశ ప్రధాని నరేంద్రమోదీ ఏది చేసిన ప్రత్యేకమే. ఆయన నిజ జీవితంలో ఓ బ్రాండ్‌ను అనుసరిస్తుంటారు. సూర్యగ్రహణం రోజు సోలార్ గ్లాస్‌కు బదులు సన్ గ్లాస్ పెట్టుకుని గ్రహనాన్నిచూడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం చేసిన ఓ ట్వీట్ కూడా వైరల్‌గా మారింది. కాగా, ఆయన పెట్టుకున్న సన్ గ్లాస్ చూసిన తర్వాత చాలా మంది దాని బ్రాండ్ వెతికే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత కళ్లజోడు మేబ్యాచ్‌కు చెందినదని, ఆ కళ్లజోడు విలువ రూ.1.4 లక్షలు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ధరను చూసిన నెటిజన్లు ఆ బ్రాండ్ కళ్లజోడు ధరను తెలుసుకునే పనిలోపడ్డారు. మొత్తానికి వాటి ధరను సేకరించారు. జన్మనీలో తయారయ్యే ఈ లగ్జరీ కళ్లపోడు విలువ 1,995 డాలర్లు (రూ. 1,42,148) అని తెలుసుకుని షాక్ గురయ్యారు.
మేబ్యాచ్‌కు చెందిన ఆ ఆర్టిస్ట్ వి కళ్లజోడు జర్మనీలో మాత్రమే తయారవుతాయని తెలిసింది. దీని ఫ్రేమ్‌ను టిటానియంతో, మిగిలిన భాగాలు కలప లేదాక కొమ్ములతో తయారు చేస్తారట. గ్లాస్‌లు మొత్తం ఆరు రంగుల్లో లభ్యమవుతాయని తెలిసింది.