'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' పేరుతో ప్యాకేజీ: ప్రధాని మోదీ
By సుభాష్ Published on 12 May 2020 8:45 PM ISTదేశంలో కరోనా కాలరాస్తుండటంతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 17తో ముగియనున్న లాక్‌డౌన్ కారణంగా మోదీ మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్యాకేజీని ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. స్వయంసమృద్ది, ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు. దేశ జీడీపీలో పదిశాతం మొత్తంతో ప్యాకేజీ ఉంటుందన్నారు. ల్యాండ్, లేబర్, లా, లిక్విడిటీలకు బలం చేకూర్చేలా ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడం కోసమే ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
ఇక లాక్‌డౌన్‌ను పొడిగించాలా.. వద్ద అనే అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నివేదికలు తీసుకుని మే 18వ తేదీకి ముందే నాలుగో దశ లాక్‌డౌన్ ప్రకటించనున్నట్లు తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో మే 17వ తేదీ నాటికి మూడో దశ లాక్‌డౌన్ ముగియనుంది.
సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్ అమలు, కరోనా కేసుల సంఖ్య తదితర అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ పొడిగించాలా..? వద్దా అనే అంశం రాష్ట్రాలకే వదిలేశారు. మే 15 వరకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టు సమర్పించాలని, రిపోర్టును పరిశీలించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో ఈ రోజు మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.