ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి భారత్‌లో కూడా చాపకింద నీరులా వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో మే 17వ తేదీతో దేశంలో లాక్‌డౌన్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని అన్నారు. ఇలాంటి సంక్షోభం కనివిని ఎరుగనిదన్నారు.

మానవ జాతికి ఇది అనుహ్యమైనదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 42 లక్షలకుపైగా కరోనా సోకిందని, కాని మనిషి మాత్రం ఓడిపోయేందుకు సిద్దంగా లేడన్నారు. మనమంతా దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నామని అన్నారు. మనం బతకాలి.. బతికించుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. మన సంకల్పం సంక్షోభం కంటే చాలా గొప్పదని, కరోనా నేపథ్యంలో ప్రస్తుతం మనం కీలక దశలో ఉన్నామన్నారు. ఆత్మస్థైర్యం కలిగిన భారత్‌ అనేది మన మార్గమని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు పాటించడం వల్ల మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని, లేకపోతే మరింత ప్రమాదంలో ఉండేవారని అన్నారు. ఈ సంక్షోమం మనకు ఒక కీలక దశగా మారాలని ప్రజలకు సూచించారు. కరోనాను ఎదుర్కొవడానికి స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమన్నారు. ఈ సంక్షోభం మొదలైనప్పుడు మన దేశంలో పీపీఈల ఉత్పత్తిలేదని, ఇప్పుడు ప్రతి రోజూ 2 లక్షల పీపీఈలు, ఎన్‌-95 మాస్కులు ఉత్పత్తిచేస్తున్నామన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *