కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడి చేయాలంటే ఏప్రిల్‌ 14వరకు లాక్‌డౌన్‌ తప్పని సరి అని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నరేంద్రమోదీ మన్‌కీబాత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ నిర్ణయంపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిర్వహించాలని తాను ప్రకటించక తప్పలేదని అన్నారు.

కరోనా వైరస్‌ కారణంగా వేరే మార్గం లేకుండా పోయిందని అన్నారు. మనం కరోనా వైరస్‌పై పోరాడాలంటే ఇలాంటి నిర్ణయం తప్పనిసరి అని అన్నారు. ప్రపంచ దేశాల పరిస్థితులను చూస్తుంటే ఇలాంటి నిర్ణయాలు పాటించక తప్పదన్నారు. 63వ మన్‌కీ బాత్‌లో కరోనాపైనే చర్చించారు. కరోనా వైరస్‌కు మెడిసిన్‌ లేని కారణంగా నివారణ ఒక్కటే మార్గమన్నారు. మనుషుల మధ్య దూరం తప్పని సరి అని సూచించారు. కొందరిని క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించినా వారు అభ్యంతకరం వ్యక్తం చేయడం కొంత బాధపడుతున్నానని అన్నారు. పరిస్థితులను ప్రతీ ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరారు.

ఇప్పటికే కరోనా ప్రభావంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. వేలల్లో మరణాలు, లక్షల్లో పాటిజివ్‌ కేసులు నమోదవుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ అన్ని దేశాలను సైతం గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాను సైతం కుదిపేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో చైనాను దాటేసింది అమెరికా. మృతుల సంఖ్య కూడా 2వేలకుపైగానే ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.