తాను రాజకీయాల్లోకి వస్తానని ఎన్న‌డూ అనుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాను ఆధ్యాత్మికత వైపు వెళ్లాలని అనుకున్నాన‌ని, చెప్పుకొచ్చారు. మన్ కీ బాత్ మోడీ ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఒక‌ప్పుడు పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డే వార‌ని, రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో ప్ర‌స్తుతం విద్యార్థులు పుస్తకాలు చదవడం మానేసి, అంతర్జాలంలో వెతుకుతున్నారని పేర్కొన్నారు. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు సమయంలో ప్రజలు చూపిన సద్భావన హర్షణీయమని అన్నారు. శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వమే మన దేశ నినాదమన్నారు. మ‌న దేశంలో యువ‌త‌కు ఎంతో చైత‌న్యం ఉంద‌ని, మ‌న దేశాన్న మంచి మార్గం వైపు తీసుకెళ్లేందుకు యువ‌త చేతుల్లోనే ఉంద‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు తెలిపి ఇందులో పాల్గొనాలని మోదీ కోరారు. నవంబరు 26కి మరో రెండు రోజులు మాత్రమే ఉందని, ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ దినోత్సవమని మోదీ గుర్తు చేశారు. భారత రాజ్యాంగ సభలో నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందిందని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.