ప్రధాని మోదీ లడఖ్‌లో జవాన్లను పరామర్శిస్తున్న దృశ్యాలు

By సుభాష్  Published on  4 July 2020 3:13 AM GMT
ప్రధాని మోదీ లడఖ్‌లో జవాన్లను పరామర్శిస్తున్న దృశ్యాలు

భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం లడఖ్‌ ఆకస్మిక పర్యటన చేసిన విషయం తెలిసిందే. గత నెలలో భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన సైనికుల ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులు కాగా, చాలా మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు మోదీ పర్యటన కొనసాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను మోదీ పరామర్శించారు. వారికి ధైర్యాన్ని ఇచ్చారు. మనోధైర్యం కోల్పోవద్దని, అన్ని విధాలుగా మీకు అండగా ఉంటానని మరి భుజం తట్టు భరోసా ఇచ్చారు. ఇక సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులోని నీమ్‌లో అక్కడి పరిస్థితులపై మోదీ సైనిక ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

03

04 సైనికుల్లో మనో ధైర్యాన్ని నింపుతున్న ప్రధాని మోదీ

07

దేశ సైనికులు ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని, దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతుందని అన్నారు. ప్రపంచం మొత్తానికి గట్టి సందేశం ఇచ్చారు. లడఖ్‌ నుంచి కార్గిల్‌ వరకు మీ ధైర్యం అమోఘమన్నారు. ఇంత కఠిన పరిస్థితుల్లోనూ దేశం కోసం పని చేస్తున్నారని కొనియాడారు. అయితే మోదీ సైనికులను పరార్శించడం పట్ల వారిలో మనోధైర్యం పెరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి భుజం తట్టి పరామర్శించారు.

01

08 సైనికులనుద్దేశించి ప్రసంగిస్తున్న మోదీ

02

09

Next Story