ఇప్పటికే చైనాకు సంబంధించిన 59 యాప్‌లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న భారత్‌.. తాజాగా చైనాకు మరో షాకిచ్చింది. తాజాగా హైవే ప్రాజెక్టులో చైనా సంస్థలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది. హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం పేర్కొన్నారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లో చైనా పెట్టుబడిదారులను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టం చేశారు.

త్వరలోనే హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా ఓ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఆ విధానంలో హైవే ప్రాజెక్టులో పాల్గొనేలా భారత్‌ కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా సడలింపు చేపడతామన్నారు.

సుభాష్

.

Next Story