ఢిల్లీ: స్వచ్ఛ్‌ భారత్‌పై తన అంకిత భావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రుజువు చేసుకున్నారు. ఓ సాధారణ వ్యక్తిలా మామల్లపురం బీచ్‌లో అరగంటపాటు తిరిగిన మోదీ.. అక్కడున్న చెత్తను స్వయంగా ఎత్తారు. బీచ్‌లో పడి ఉన్న బాటిళ్లను, కవర్లను తీసి శుభ్రం చేశారు. బీచ్‌లో ఉన్న సమయంలో ప్రధాని మోదీ తన చేతిలో ఓ టార్చ్‌లైట్‌ వంటి పరికరాన్ని పట్టుకొని ఉన్నారు. మోదీ చెత్త తీస్తున్నప్పటి వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్ల దృష్టి ఆ పరికరం మీదనే పడింది. తక్కువ బరువున్న డంబెల్‌ అని కొందరు అనగా.. మరికొందరు టార్చ్‌లైట్‌ అని సోషల్‌ మీడియాలో చర్చించుకున్నారు.

Modi 4 (2)

దీంతో ప్రధాని మోదీ ఆ పరికరంపై ట్వీటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఆ పరికరం పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌ అని.. నేను దాన్ని తరచుగా వాడుతానని మోదీ తెలిపారు. అది నాకు ఎంతో మేలు చేసిందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఆక్యు ప్రెజర్‌ రోలర్‌ను ఉపయోగించడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందవి. నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.