కరోనా వేళలోనూ ప్రధాని ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2020 1:52 PM ISTప్రధాని మోడీ ఎంత ఫ్యాషన్ బుల్ గా ఉంటారో తెలియంది కాదు. కానీ.. లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అయ్యే తీరు తొలిసారి బయటకు వచ్చింది. అప్పట్లో ఒబామా భారత్ కు వచ్చినప్పుడు అమెరికా తొలి మహిళకు మించి.. దుస్తుల్ని మార్చిన మోడీ తీరు మీడియాలో పెద్ద ఎత్తున రావటమే కాదు.. ఆయన ఇమేజ్ ను కొంత మేర దెబ్బ తీసింది. అయితే.. అలాంటి విషయాల్లోనూ మోడీని వెనకేసుకురావటానికి నమో ఫ్యాన్ భారీఎత్తున ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
అంఫన్ తుపాను తాకిడితో విలవిలలాడుతున్న పశ్చిమబెంగాల్ లో ఏరియల్ వ్యూలో సమీక్షించిన ప్రధాని.. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఏరియల్ వ్యూకు వెళ్లిన సందర్భంగా ప్రధాని కాలికి బ్లాక్ షూస్ ఉండగా.. ఆయన సాక్స్ ధరించకపోవటం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కాలంలో కొందరు సెలబ్రిటీలు.. ప్రముఖులు ఫార్మల్ షూస్ కు సైతం సాక్స్ వేసుకోవటం మానేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్రెండ్ ను ప్రధాని ఫాలో కావటం చూస్తే.. ఫ్యాషన్ రంగంలో వచ్చే ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు మోడీ ఫాలో అవుతారనటానికి తాజా ఉదంతం ఓ పెద్ద ఉదాహరణగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. ఒక రాష్ట్ర అధికార పర్యటన కోసం వచ్చిన ప్రధాని.. ఫార్మల్ షూస్ కు.. సాక్స్ ధరించని తీరు ఫ్యాషన్ ప్రియుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది.