అందుకే రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ: మోదీ
By సుభాష్ Published on 13 May 2020 8:04 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 17వ తేదీతో మూడో దశ లాక్డౌన్ ముగియనుంది. దీంతో నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ, ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడారు. నాలుగు నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రపంచం యుద్ధం చేస్తోందని అన్నారు. ఇలంటి సంక్షోభంలో ఎన్నో నష్టాలు జరిగాయన్నారు. సంక్షోభం మొదలైనప్పుడు మన దేశంలో పీపీఈల ఉత్పత్తి లేదని, ఇప్పుడు ప్రతిరోజు రెండులక్షల పీపీఈల ఉత్పత్తి, ఎన్-95 మాస్కులు ఉత్పత్తి చేస్తున్నామన్నారు.
ఇక ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్యాకేజీని ప్రకించారు. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీ స్వయంసమృద్ది, ఆర్థిక నిర్మాణానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశ జీడీపీలో పదిశాతం మొత్తంతో ప్యాకేజీ ఉంటుందన్నారు. ల్యాండ్, లేబర్, లా, లిక్విడిటీలకు బలం చేకూర్చేలా ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడం కోసమే ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దేశ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా పడపోయాయి. సామాన్యుల నుంచి వ్యాపార వేత్తల వరకూ పనులు వ్యాపారాలు, పనులు లేక తీవ్ర నష్టాల్లో చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తీవ్ర స్థాయిలో నష్టపోయామని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతామాన్‌కు కోరారు. దీంతో లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి రావడంతో కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊరటనిచ్చింది. అయితే ఈ రోజు నాలుగు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారహన్ ప్యాకేజీ గురించి వివరించనున్నారు. ఏ రంగానికి ఎంత కేటాయించారనేది ప్రకటిస్తారు.