మోదీ చెప్పిన సప్త సూత్రాలు
By రాణి
కరోనా రక్కసి ఆట కట్టించేందుకు తొలివిడత 21 రోజుల లాక్ డౌన్ పెట్టిన మోదీ..ఇప్పుడున్న ఆంక్షలతో పాటే మరింత కఠినంగా మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు మంగళవారం ఉదయం ప్రకటన చేశారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ 21 రోజులపాటు లాక్ డౌన్ ను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదేవిధంగా మే 3 వరకు కూడా కాస్త సంయమనంతో సహకరించాల్సిందిగా మోదీ కోరారు. అలాగే కరోనా పై విజయం సాధించేందుకు 7 సూత్రాలను పాటించాలంటూ ప్రజల కోసం సప్త సూత్రాలను చెప్పారు.
Also Read : బిగ్‌బ్రేకింగ్: మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
1. ఇంట్లో ఉంటూనే కుటుంబ సభ్యులు దూరం పాటించాలి. అనవసరంగా బయటికి వెళ్లొద్దు.
2.సొంతంగా తయారు చేసుకున్న మాస్కులను శుభ్రం చేసుకుంటూ వాడుకోవాలి.
3.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
4.దేశ ప్రజలంతా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
5.అన్నార్తులు, పేదలకు ఆహారం అందించి ఆదుకోవాలి.
6.లాక్ డౌన్ వల్ల నష్టాలొస్తున్నాయని పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగులను తొలగించవద్దు.
7.దేశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలి.