కరోనాపై మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోందని అన్నారు. కరోనా కష్టాలను తట్టుకుని ప్రజలు దేశాన్ని కాపాడుతున్నారని చెప్పారు. ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో నేను అర్థం చేసుంటున్నా. కరోనాపై భారత్‌ బలంగా పోరాడుతోంది. కరోనా పోరాటానికి ప్రతీ ఒక్కరు సహకరిస్తున్నారని అన్నారు. కరోనాపై పోరాటం చేయడంలో దేశమంతా ఒకేతాటిపై ఉందన్నారు. మే 3వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. మరో 19 రోజులు పొడిగిస్తున్నట్లు చెప్పారు.

దేశంలో ఒక్క కరోనా కేసు రాకముందే స్క్రీనింగ్‌ చేశామని అన్నారు. దేశం కోసం ప్రజలందరూ సైనికుల్లా పని చేస్తున్నారని పేర్కొన్నారు. 21 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేశాం. కరోనా మహమ్మారిగా మారకముందే దేశంలో చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కరోనా కట్టడికి వేగవంతంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కరోనా కట్టడిలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం మెరుగ్గా ఉన్నామన్నారు. భారత్‌లో 550 కేసులున్నప్పటికీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగించింది.
కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో పొడిగించక తప్పలేదని, ప్రజలంతా సహకరించాలని మోదీ కోరారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.