మొద్దుశ్రీను హత్యకేసు నిందితుడు ఓం ప్ర‌కాష్ మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 12:09 PM GMT
మొద్దుశ్రీను హత్యకేసు నిందితుడు ఓం ప్ర‌కాష్ మృతి

మొద్దుశ్రీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్‌ మృతి చెందాడు. గ‌త కొంత‌గాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోన్న‌ ఓం ప్రకాశ్‌ కేజీహెచ్ లో చికిత్స్ పొందుతూ తుది శ్వాస విడిచాడు. టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దుశ్రీను ను 2008 నవంబర్ లో జైలులో డంబెల్‌తో కొట్టి హత్య చేశాడు. తాను రామకోటి రాసుకుంటుండగా.. జైలు గదిలోని లైటును మొద్దు శీను ఆర్పేశాడని, ఆ కోపంతోనే అతన్ని హత్య చేసినట్టు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓంప్రకాశ్ తెలిపాడు ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఓం ప్రకాష్‌కు జీవిత ఖైదు విధించింది. దీంతో 2016 నుంచి విశాఖ సెంట్రల్‌ జైలులో ఓం ప్రకాష్‌ శిక్ష అనుభవిస్తున్నాడు.

గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓం ప్రకాశ్‌కు డయాసిస్‌ చేస్తున్నారు. కేజీహెచ్‌ ఆస్పత్రిలో శుక్రవారం డయాసిస్ జరిగిందని, ఆతర్వాత మళ్లీ జెలుకి తరలించగా.. శనివారం మళ్లీ అతనికి సమస్య రావడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ తెలిపారు. ఓం ప్రకాశ్‌ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె.

Next Story