రోజాకు సీఎం జగన్‌ బంపర్‌ ఆఫర్‌.. మరో కీలక బాధ్యత..?

By సుభాష్  Published on  7 Jun 2020 7:18 AM GMT
రోజాకు సీఎం జగన్‌ బంపర్‌ ఆఫర్‌.. మరో కీలక బాధ్యత..?

ఏపీలో జగన్‌ సర్కార్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని పరిస్థితి. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం జగన్‌.. పాలనపరంగా అధికారులను సైతం ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఒక రంగానికే కాకుండా అన్ని రంగాలను సైతం ఆదుకోవాలనేదే జగన్‌ ఆలోచన. ఇక జగన్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్న అతికొద్ది మందిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరనే చెప్పాలి. కొన్ని కారణాల వల్ల రోజాను పక్కనబెట్టక తప్పలేదు. ఇక తర్వాత ఏపీ ఐఐసీ చైర్‌పర్సన్‌గా కేబినెట్‌ స్థాయి పదవీని రోజాకు కట్టబెట్టారు.

ఇక తాజాగా రోజాకు మరో కీలక బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్‌ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సినీ హీరోయిన్‌గా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన రోజా అనుభవాలను సైతం సినీ పరిశ్రమను ఆదుకునేందుకు వినియోగించుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహించాలని జగన్‌ భావిస్తున్నారు. ఇక సీఎంను కలిసిన మెగాస్టార్‌ చిరంజీవితో పాటు ఇతర ప్రముఖులతో సీఎం జగన్‌ ఇదే విషయాన్ని చర్చించారు. తాజాగా దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్నకరోనా వైరస్‌ ప్రభావం సినీ పరిశ్రమపై బాగానే పడింది. ఈ కరోనా నేపథ్యంలో కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను ఆదుకోవాలని జగన్‌ భావిస్తున్నారు. ఇక ఏపీలో ఉచితంగా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

జగన్‌ వేయబోయే కమిటీ బాధ్యతలు రోజాకు

కాగా, ఈ షూటింగ్‌లు జరుపుకొనేందుకు అనుమతులు ఎలా ఇవ్వాలి..? ఎవరికి ఇవ్వాలి.? అనే అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక్క రోజానే అని చెప్పాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారిలో రోజా మాత్రమే. దీంతో చిత్రపరిశ్రమపై సీఎం జగన్‌ వేయబోయే కమిటీ బాధ్యతలు రోజాకు అప్పగించి ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించి ఏపీలో ప్రోత్సహాలు అందించాలని జగన్‌ ఆలోచిస్తుట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రోజాకు జగన్‌ మరో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతలు అప్పగించినట్లయితే ఒక పక్క నగరి ఎమ్మెల్యే బాధ్యతలు, మరో పక్క ఏపీఐఐసీ బాధ్యతలు, ఇంకో పక్క సినీ ఇండస్ట్రీ బాధ్యతలు మోయనున్నారు. జగన్‌ జట్టులో మంత్రి పదవి దక్కకపోయినా ..ఈ విధంగా జగన్‌ ఆపర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు.

Next Story