మిత్రోన్ యాప్ 'యమ డేంజర్'
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jun 2020 11:31 AM ISTమిత్రోన్( హిందీలో స్నేహితులు) అని అర్థం. ఈ యాప్ భారత్ దే అనుకుని ఇన్స్టాల్ చెసింటే పెద్ద ప్రమాదమే.. వెంటనే డిలీట్ చేసేయండి అంటున్నారు టెక్ నిపుణులు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చైనా ప్రోడక్ట్స్ ను వాడకూడదని కోరుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏదైనా మేడ్ ఇన్ ఇండియా అయితే బెటర్ అని అంటున్నారు. యాప్స్ విషయంలో కానీ.. వస్తువుల విషయంలో కానీ అదే పాటిస్తే బెటర్ అని అంటున్నారు.
తాజాగా కొన్ని కోట్ల మంది టిక్ టాక్ ను అన్ ఇంస్టాల్ చేసేసారు. దానికి బదులుగా మేడిన్ ఇండియా యాప్ ఏదైనా వాడాలని కోరారు. ఇంతలో మిత్రోన్ యాప్ సోషల్ మీడియా లోకి వచ్చేసింది. టిక్ టాక్ కు తగ్గుతున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఇది బాగా ప్రాచుర్యం లోకి రావడం మొదలైంది. ఈ ఆండ్రాయిడ్ యాప్ 48 గంటల్లోనే 5 మిళియన్లకు పైగా ఇన్స్టలేషన్స్ ను సొంతం చేసుకుంది. 250000 5 స్టార్ రేటింగ్స్ ను అందుకుంది. 'మిత్రోన్' అన్న పదం భారతదేశంలో బాగా ఫేమస్ కావడంతో పెద్ద ఎత్తున డౌన్ లోడ్స్ ను సొంతం చేసుకుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉండడంతో నెటిజన్లు కూడా ఇది భారత్ ప్రోడక్ట్ అనుకున్నారు. భారత్ కు చెందిన వస్తువులనే వాడుదాం అంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో మిత్రోన్ యాప్ కు మంచి పాపులారిటీ దక్కింది. #tiktokban #IndiansAgainstTikTok వంటివి బాగా వైరల్ అవడంతో టిక్ టాక్ కు భారత్ లో గడ్డు పరిస్థితిఎదురైంది.
మిత్రోన్ యాప్ సెక్యూరిటీ ఎంత:
టిక్ టాక్ యాప్ మీద ఏర్పడ్డ వ్యతిరేకత కారణంగా వేరే యాప్స్ మీద దృష్టి పెడుతున్న భారతీయులు.. కనీస సెక్యూరిటీ ఇవ్వలేని 'మిత్రోన్' యాప్ వైపు దృష్టి మరల్చారు. ఈ మిత్రోన్ యాప్ లో ఉన్న లూప్ హోల్స్ కారణంగా కొన్ని నిమిషాల్లో ఏ అకౌంట్ ను అయినా హ్యాక్ చేసేయొచ్చట. అందుకు సంబంధించిన వీడియోలను యుట్యూబ్ లో చూసేయొచ్చు.
కేవలం ఐడీ గురించి తెలుసుకుని అకౌంట్ ను హ్యాక్ చేయగలుగుతున్నారు అంటే.. మిత్రోన్ లో సెక్యూరిటీ ఫీచర్స్ అన్నది ఎంత తక్కువ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
మిత్రోన్ యాప్ ను డెవలప్ చేయలేదట
మిత్రోన్ యాప్ ను ప్రత్యేకంగా డెవలప్ చేయలేదని.. కేవలం రెడీ మేడ్ గా కొన్నారని తెలుస్తోంది. పాకిస్థానీ సాఫ్ట్వేర్ సంస్థ క్యూబాక్సస్ సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేసిన టిక్ టిక్ యాప్ ను మిత్రోన్ యాప్ గా మార్చినట్లు తెలుస్తోంది. పలు ప్రముఖ యాప్స్ కు సంబంధించిన క్లోన్స్ ను ఈ పాకిస్థానీ కంపెనీ డెవలప్ చేస్తూ ఉంటుంది. మిత్రోన్ యాప్ ఓనర్ మాత్రమే కాకుండా 250 మంది డెవలపర్స్ కూడా టిక్ టిక్ యాప్ కోడ్ ను కొనుక్కున్నారట. కోడ్ లో మార్పులు చేశారో లేదో తెలీదని క్యూబాక్సస్ సియిఓ ఇర్ఫాన్ షేక్ తెలిపారు.
మిత్రోన్ యాప్ భారత్ కు చెందినదా కాదా..?
మిత్రోన్ యాప్ కోడ్ అన్నది పాకిస్థాన్ కు చెందిన సంస్థ డెవలప్ చేసినప్పటికీ.. యాప్ ఓనర్ భారతీయుడేనని తెలుస్తోంది. ఐఐటీ రూర్కీ కి చెందిన పూర్వ విద్యార్థి ఈ యాప్ ను కొన్నట్లు తెలుస్తోంది. యాప్ లో ఉన్న పొరపాట్లను తెలియజేస్తూ మెయిల్ చేస్తున్నా సరిగా స్పందించడం లేదని కొందరు అంటున్నారు.
ఈ యాప్ లో ప్రస్తుతం చాలా తప్పులు ఉండడంతో వాడకపోవడమే మంచిదని అంటున్నారు. ఈ యాప్ ఓనర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి. ప్రైవసీ పాలసీ సర్వీస్ కూడా సరిగా లేదు.. టర్మ్స్ ఆఫ్ యూజ్ కూడా లేదు. దీంతో యాప్ ను ఇన్స్టాల్ చేయకపావడమే మంచిదని అంటున్నారు.