విశాఖలో ముగ్గురు యువతుల మిస్సింగ్
By అంజి Published on 18 Feb 2020 3:21 PM IST
విశాఖ జిల్లాలో ముగ్గురు యువతుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ద్వారకానగర్‌లోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. అనంతరం మా కోసం వెతకొద్దంటూ తల్లిదండ్రుల ఫోన్ మెస్సేజ్ పెట్టారు. తాము చనిపోతున్నామంటూ తల్లికి యువతులు మెస్సేజ్ పెట్టారు. దీంతో యువతుల తల్లిదండ్రులు ద్వారాకనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏసీపీ ఆధ్వర్యంలో మూడు పోలీస్ బృందాలు.. యువతుల కోసం గాలిస్తున్నాయి. యువతుల తల్లిదండ్రులు, బంధువుల ఆందోళనకు గురవుతున్నారు. విశాఖ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు. యువతుల అదృశ్యం కావడానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
యువతుల జాడ కోసం విశాఖను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ద్వారాకనగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు, బంధువులు కలిసి యువతుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ద్వారకానగర్‌లో నివాసముంటున్న ఎర్రంనాయుడు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అనూరాధ (22), తులసి (20), కోమలి (17) ముగ్గురు యువతులు సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా బయటకు వెళ్లారు. ఆ తర్వాత యువతులు తిరిగి ఇంటికి చేరుకోలేదు. యువతుల ఆచూకీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.