'మీర్జాపూర్-2' రాబోతుంది.. ఎప్పుడంటే.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Aug 2020 3:24 PM ISTకరోనా కారణంగా సరైన ఎంటర్‌టైన్‌మెంట్ లేక ఇంటికే పరిమితమై ఓటీటీలలో వచ్చే వెబ్ సిరీస్‌లకు అలవాటుపడ్డ జనాలకు అమెజాన్ ఫ్రైమ్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2018లో అమెజాన్ ఫ్రైమ్‌లో విడుదలై సంచలనం సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ కు సీక్వెల్.. ‘మీర్జాపూర్ 2’ విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ వీడియోను పోస్టు చేసింది.
మీర్జాపూర్-2 అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. మీర్జాపూర్ మొదటి సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే.. అప్పటి నుండే చాలామంది సెకండ్ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న మీర్జాపూర్-2 కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీక్వెల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.
మిర్జాపూర్ కథ విషయానికొస్తే.. డ్రగ్స్, గన్స్ , అన్యాయం చుట్టూ తిరుగుతుంది. మాఫియా డాన్స్ పాలన, ఉత్తర ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్న శత్రుత్వం, నేరాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ సిరీస్ మొదటి సీజన్‌లో అలీ ఫజల్, విక్రాంత్ మాస్సే, శ్వేతా త్రిపాఠి, శ్రియా పిల్గావ్కర్, రసిక దుగల్, హర్షితా గౌర్, దివియేండు శర్మ, కుల్భూషణ్ ఖర్బండా ముఖ్యపాత్రల్లో నటించారు. మొదటి సీజన్‌తో రికార్డులు కూడగట్టుకున్న మిర్జాపూర్.. మరి రెండో సీజన్‌లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే.