క‌రోనా విజృంభ‌ణ‌తో కుదేల‌వుతున్న రాష్ట్రాల‌కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి కేంద్ర‌ప్ర‌భుత్వం పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ ట్విటర్ ద్వారా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

కేంద్ర ఆర్ధిక శాఖ లిస్టు ప్ర‌కారం.. తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణ,‌ ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ.రూ.982 కోట్లు, రూ.1892.64కోట్లు విడుదల చేయ‌గా.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.8255కోట్లు, బీహార్‌కు రూ.4631కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.3630కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.3461కోట్లు, గోవాకు రూ.155కోట్లు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కార‌ణంగా రాష్ట్రాల‌ ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయి దాదాపు ఖజానాలు ఖాళీ అయిన పరిస్థితి. ఈ నేఫ‌థ్యంలో కేంద్రం రాష్ట్రాలకు రాష్ట్రాల‌కు నిధులు విడుద‌ల చేయ‌డం ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.